Collector Koya : క్యాన్సర్ నియంత్రణకు ప్రణాళిక బద్దంగా పని చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

క్యాన్సర్ స్క్రీనింగ్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జూలై -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు రోహిణి ఫౌండేషన్ ద్వారా 10 గ్రామాలలో పర్యటించి 2 వేల కు పైగా ప్రజలను క్యాన్సర్ స్క్రీనింగ్ చేశామని అన్నారు. ప్రజల అలవాట్ల ఆధారంగా పరీక్షలు నిర్వహించి 104 మందికి క్యాన్సర్ గుర్తించామని, వీరిలో 90 మంది స్టేజి 3, స్టేజి 4 దశలో ఉన్నారని అధికారులు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, క్యాన్సర్ వల్నరబుల్ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన పరీక్షలు చేయాలని అన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ రంగంలోని క్యాన్సర్ చికిత్స అందించే ఆసుపత్రులతో కోఆర్డినేట్ చేసుకుంటూ క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని అన్నారు 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారిని ఎన్.సి.డి సర్వే లో భాగంగా నోటి క్యాన్సర్ లక్షణాలు పరిశీలించి, అనుమానితులకు నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

క్యాన్సర్ రోగులకు చికిత్స అందించిన తర్వాత మళ్ళీ చెడు అలవాట్లు బారినపడకుండా కౌన్సెలింగ్ అందించాలని అన్నారు క్యాన్సర్ కేసులు గుర్తించిన రోగులకు ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని, సరైన చికిత్స తీసుకుంటూ అలవాట్లు మార్చుకుంటే నయం చేయవచ్చని భరోసా కల్పించాలని అన్నారు. కొత్త క్యాన్సర్ కేసులు రాకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు జిల్లాలో 8 లక్షల జనాభా ఉందని, 5 వేల వరకు క్యాన్సర్ కేసులు ఉండే ఆస్కారం ఉంటుందని, వీరికి ఎటువంటి చికిత్స అందించాలి, గుర్తింపు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Sri Harsha

You cannot copy content of this page

Scroll to Top