Operation Muskan- XI : ఆపరేషన్ ముస్కాన్- XI నిర్వహణ పై సమీక్ష సమావేశం

TRINETHRAM NEWS

బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జూలై 1 నుండి 31-07-2025 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-XI నిర్వహణ గురించి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి జిల్లా ఆపరేషన్ ముస్కాన్-XI టీమ్ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు తో డిసిపి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా డిసీపీ మాట్లాడుతూ గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లలు బాల కార్మికులగా పనిచేస్తున్న హాట్ స్పాట్స్ పై నిఘా ఉంచాలి. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలి. స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారిని మరల స్కూల్ లలో చేర్పించాలి అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లల ను గుర్తించి వారిని సంబందిత హాస్పిటల్లో చేర్పించి పరిక్షలు నిర్వహించి, చికిత్స అందేలా చూడాలి. ప్రతి షాప్స్ వద్ద “నో చైల్డ్ లబోరు అర్ ఎంప్లాయడ్ హియర్ ” బోర్డ్స్ ఏర్పాటు చేపించాలి. బాల్య వివాహాల చేయడం నేరం. బాల్య వివాహలపై అవగాహన కల్పించాలి. 18 సంవత్సరాల లోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్ లలొ పని చేసిన, పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం చేయాలని అన్నారు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లలను గుర్తించడానికి “దర్పహన్” అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకొంటామని, ఆపరేషన్ ముస్కాన్ -XI లో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. విరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్-Xl నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన, తప్పిపోయిన, వదిలివేయబడిన, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, 112, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని డిసీపీ తెలిపారు
ఈ సమావేశంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐ దివ్య, శైలజ, వేణు గోపాల్, సీ్వచ్ చైర్ పర్సన్ శ్రీధర్, జి. చంద్రయ్య, మెమో రామగుండం, శ్యామ్ సుందర్ సీ్వచ్ మెంబెర్, డాక్టర్ రాజమౌళి ప్రోగ్రాం ఆఫీసర్, రవీందర్ ఆలోచన మంథని, దవు వేణు, డీసీపీ జితేందర్, సీ్వచ్ మెంబర్ సుమలత, ఉమాదేవి చచ్చి కోఆర్డినేటర్, సీడ్ శ్యామల, శారదా ఆయా, దెవొ ఆఫీస్, హేమలత, ఆలోచన పెద్దపల్లి, శ్రీనాథ్ ఆలోచన, ఆఫీస్ పెద్దపల్లి, ఆపరేషన్ ముస్కాన్ టీం పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Review meeting on the

You cannot copy content of this page

Scroll to Top