రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ జూలై 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద జాతీయ ఆహార భద్రత మిషన్ (NFM) ద్వారా జొన్న మరియు కందివిత్తనాల చిరు సంచులను లబ్ధిదారులకు స్వయంగా అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
వ్యవసాయం అంటే దండుగ కాదు.. వ్యవసాయం అంటే పండుగ. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణా రెడ్డి,PD రాజ్ కుమార్, అగ్రికల్చర్ AD శ్రీ లక్ష్మీ,మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓలు, AE లు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


