వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా యందు గల కెజిబివి లలో మిగిలిన 12 ఖాళీలు స్పెషల్ ఆఫీసర్, పీజీసిఆర్టి, సిఆర్టి, పిఈటి పోస్టులను భర్తీ చేయుటకు శ్రీయుత రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష, తెలంగాణ, హైదరాబాద్ ఆదేశానుసారం 2022 – 23 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్ష మెరిట్ లిస్టులోని అభ్యర్థులను రోస్టర్ కం మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తి ప్రకారము డీఈవో కార్యాలయం నందు గల నోటీసు బోర్డులో పొందుపరిచిన లిస్టులో ఉన్న అభ్యర్థులు మాత్రమే తేదీ: 03.07.2025 నాడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తము జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, వికారాబాద్ నందు ఉదయం 11 గంటలకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావలసిందిగా తెలుపనైనది.జిల్లా విద్యాశాఖాధి కార్యాలయం, వికారాబాద్ జిల్లా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


