MLA TRR : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు MRG వినోద్ రెడ్డి , కోఅబ్జర్వర్,రామ్ శేటి నరేందర్ తో కలిసి పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ. పార్టీ బలపడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని,అర్హులైన నాయకులకు ఖచ్చితంగా పదవులు వస్తాయ అన్నారు.నాయకత్వం అందరికీ అవకాశం ఇస్తుందని,క్షేత్ర స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతును పెంచాలన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేలా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The goal is to

You cannot copy content of this page

Scroll to Top