జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూన్ 22: జీవో నెంబర్ 3 అమలులో నిర్లక్ష్యం, గిరిజనులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచి పెంట శాంతకుమారి తీవ్రంగా విమర్శించారు. ఇటీవల విశాఖపట్నం జిల్లా మరియు అనకాపల్లి పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో గిరిజన సమస్యలపై కీలకంగా చర్చ జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు గారికి ఘన స్వాగతం పలికిన శాంతకుమారి, గిరిజన సమస్యలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మెమోరండం అందజేశారు.

  1. జీవో నెంబర్ 3 ప్రకారం గిరిజన నిరుద్యోగులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ నూతన ఉద్యోగ భద్రత చట్టాన్ని తీసుకురావాలి.
  2. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చేసిన తొలి సంతకం ప్రకారం ఆశ్రమ పాఠశాల హెల్త్ వాలంటీర్ల రీన్యూవల్ ఇప్పటివరకు జరగలేదు.
  3. ఐటీడీఏ పరిధిలోని బ్యాక్లాగ్ పోస్టులకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
  4. గిరిజన భూసంరక్షణ కోసం 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి.
  5. GCC మరియు APTDC కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్థిర నియామకాలు ఇవ్వాలి.
  6. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలి.
  7. కాఫీ, పసుపు, మిరియాలు, అల్లం వంటి గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
  8. గిరిజన గ్రామాలకు రోడ్లు, మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
  9. గ్రామ వాలంటీర్లను నియమించి, వారికి ప్రతినెలా ₹10,000 చెల్లించాలి.
  10. గిరిజన ప్రాంతాల్లో నల్లరాయి క్వారీలు, మైనింగ్ తవ్వకాలు తక్షణం నిలిపివేయాలి.
    ఈ సందర్భంగా కొప్పుల రాజు మాట్లాడుతూ, “పాడేరు సబ్ కలెక్టర్‌గా గిరిజనుల మధ్య పనిచేసిన అనుభవం నాకుంది. ఈ సమస్యలు నన్ను గుండెను తాకాయి. ఇవన్నీ రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను,” అని హామీ ఇచ్చారు.
    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నేతృత్వంలో, గిరిజనుల సంక్షేమం కోసం పార్టీ పోరాటాన్ని ఉధృతం చేయనుందని శాంతకుమారి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bringing tribal issues to

You cannot copy content of this page