తేదీ : 18/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలం , కోళ్ల పర్రు గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త మాజీ సర్పంచ్ ఎండపల్లి. రామారావు (74) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ఐదు సార్లు కాశీకి పాదయాత్రగా వెళ్ళాడని, కేదార్నాథ్, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు కాలినడకని వెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో శివాలయాన్ని నిర్మించి ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాడు. గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


