Anna Samaradhana : ఘనంగా అన్న సమరాద న

TRINETHRAM NEWS

తేదీ : 18/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో శ్రీ కోదండ రామాలయం ఆలయంలో ప్రతి బుధవారం భక్తులకు మహా అన్న సమారాధన జరుగుతుంది. ఆలయ కమిటీ చైర్మన్ పుచ్చకాయల. చెన్నకేశవరెడ్డి తెలిపారు. విజయవాడ వేగ బంగారు షాపు నవీన్ కుమార్, సుధాకర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రతి బుధవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మారుగా వేయి మంది భక్తులకు భోజనం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ చనుబండ గ్రామంలో నాలుగు వేల మందికి ఓట్లు గలవు. ఉపాధి హామీ పథకం కూలి పనికి ప్రతిరోజు ఐదు వందల మంది పనిచేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ కొండ. తాతయ్య అన్నారు. పంచాయతీలో ఉన్నటువంటి సూరంపాలెం, చనుబండ, మాలపల్లి చెందిన వాళ్లు మూడు చోట్ల పని కల్పిస్తున్నామని తెలిపారు. ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు పనిచేయడం జరుగుతుందని అన్నారు. వాళ్లకు మంచినీటి సౌకర్యం, విశ్రాంతి తీసుకొనుటకు టెంట్లు వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

నాలుగు వారాల డబ్బులు సంబంధిత బ్యాంకు ఖాతాలో పడ్డాయని , ఇంకా ఆరువారాల డబ్బులు రావాలని తెలిపారు. ఆ డబ్బులు వస్తేనే పూట గడుస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వం లేటు అవ్వకుండా వారం వారం వాళ్ల ఖాతాల్లోకి అమౌంట్ పడేలా చూడాలని అన్నారు. స్త్రీ, పురుషులకు కూలి నిమిత్తం రూపాయలు మూడువందల ఏడు అని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు సాలరీ వేతనం పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Anna Samaradhana on

You cannot copy content of this page

Scroll to Top