విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 18/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం , చనుబండ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు. మేడేపల్లి. రవీంద్రనాథ్ ఎమ్మెస్సీ బీఈడీ. జూన్ ఒకటవ తేదీన ప్రమోషన్తో ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగింది. పాఠశాల సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.
మొత్తం విద్యార్థులు నూట డెబ్బై మంది అని అన్నారు. ప్రభుత్వ సమయం ప్రకారం విద్యా బోధన క్రమశిక్షణతో కూడిన విద్య , క్రీడలు సమయపాలన అనుకూలంగా నిర్వహిస్తున్నామని అనడం జరిగింది. విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దుడమే అని మా లక్ష్యమని చెప్పారు. ఉపాధ్యాయులు ఎనిమిది మంది ఉన్నారని చెప్పారు. క్రీడలకు సంబంధించి పిటి ని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. జరిగినటువంటి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నలభై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా నలభై రెండు మంది విద్యార్థులు పాస్ అయినారు.
ఒక విద్యార్థి మాత్రమే ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. అందులో వెంకటలక్ష్మి ఆరు వందలు మార్కులకు గాను ఐదు వందల అరవై ఒకటి మార్కులు సాధించి సైనింగ్ స్టార్ అవార్డు అందుకోవడం జరిగింది. ఎ. బ శ్రీ ఐదు వందల అరవై మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించింది. త్రివేణి ఐదు వందల యాభై ఎనిమిది మార్కులతో తృతీయ స్థానాన్ని పొందింది. పుస్తకాలు మరియు యూనిఫామ్ ఇచ్చినట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The aim is to make

You cannot copy content of this page

Scroll to Top