జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. సోమవారం రైతుల మద్దతు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతునేస్తం కార్యక్రమం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం గట్టు మల్లారం రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కర్లపూడి బాలు అనే యువ రైతు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలను హర్షించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేపట్టిన చర్యల పట్ల నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటల మరమ్మతుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి అనేక చెరువులను ప్రాజెక్ట్లను వినియోగంలోకి తీసుకొచ్చిన తరుణంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తోడ్పాటును CM రేవంత్ రెడ్డికి వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare Adinarayana's efforts for

You cannot copy content of this page