కార్యకర్తల అభిప్రాయాలే నాకు మార్గదర్శకం

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం నూతనంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా ఏలూరి. హరి రామకృష్ణ .(హరిబాబు) ను డైనమిక్ ఎమ్మెల్యే సొంగా. రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మరియు జిల్లా , నియోజకవర్గం, మండలం, గ్రామం టిడిపి నేతలతో నియమించడం జరిగింది. అప్పటినుండి ఆయన పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా కలుసుకుని పరిచయంగా పోలాసీగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలోని పార్టీ నాయకులు హరిబాబును సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ భవిష్యత్తుకు పూర్తి మద్దతునిస్తూ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నాయకులు కోనేరు .వెంకట సుబ్బారావు, నె క్కలపు.సూర్యనారాయణ, రేగుంట. సురేష్, కనుమత. రెడ్డినరేందర్ రెడ్డి, ఎండ్రు. శ్రీనివాసరావు, సి. శ్రీనివాసరావు, బిక్కిన. వెంకట్రావు, నీటి సంఘం ప్రెసిడెంట్ రావిపాటి .భాస్కరరావు, పిన్నమనేని .సురేష్, రావిపాటి. దుర్గారావు, పాల్గొన్నారు. ఏ విధంగా అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ గ్రామస్థాయిలో నుంచి మండల స్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడంనా బాధ్యత, మన అందరి బాధ్యత అంటూ తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలే నాకు మార్గదర్శకంగా ఉంటాయి. మీ విశ్వాసాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతాను అని అన్నారు. కార్యకర్తకు గాను, ప్రజలకు సమస్య వస్తే నేను పరిష్కారాన్ని అవుతానని భరోసా ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The opinions of the

You cannot copy content of this page

Scroll to Top