MLA TRR : ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్స్ అందించిన టి ఆర్ ఆర్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట. సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఎమ్మెల్యే TRR దోమ మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లను అందించిన ఎమ్మెల్యే TRR.
దోమ మండలం దాదాపూర్ గ్రామంలోని రైతు వేదికలో దోమ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 249 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లను స్థానిక నాయకులు,అధికారులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అందజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను తీసుకున్న లబ్ధిదారులు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వానికి,ఎమ్మెల్యే TRR కు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని,తమ సర్కారు ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని,మహిళా సాధికారితనే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని,కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదని ఎమ్మెల్యే TRR గారు అన్నారు.అదేవిధంగా సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అని,ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతుందని ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఎమ్మెల్యే TRR తెలిపారు.వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని,పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.అర్హులైన ప్రతి రేషన్ కార్డ్ దారుడు సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indiramma House Proceedings presented

You cannot copy content of this page

Scroll to Top