Bandi Ramesh : కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 13 : కాంగ్రెస్ పార్టీ పేదలకు అండదండగా ఉంటుందని వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరిమణులు సుమారు 200 మందికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమేష్ హాజరయ్యారు. హాజరై లబ్ధిదారులకు గురువారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి తనను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అగర్ నాయకులకు సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి తన రాజకీయ గురువు తుమ్మల నాగేశ్వరరావు కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ అధినాయకలతో తన మీద ఉంచిన నమ్మకాన్ని అమలు చేయాలని నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన గత 18 నెలలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతోపాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇందులో ప్రధానమైనది సన్న బియ్యం పంపిణీ కార్యక్రమo అనీ మూడు నెలల రేషన్ ను ఒకేసారి ముందుగా ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి పట్లోళ్ల నాగిరెడ్డి వేణు, డివిజన్ ప్రెసిడెంట్స్, మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్స్, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TPCC Vice President Bandi

You cannot copy content of this page

Scroll to Top