డిండి (గుండ్లపల్లి)జూన్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలో అక్రమ సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం పట్టికను భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. చౌరస్తాలో పోలీసులకు అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక ఆటోలో ఏ పీ 22X3130 నంబర్ గల ఆటోను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అందులో 14 బస్తాలనల్లబెల్లం (420 కిలోలు) రెండు బస్తాల పట్టిక (100కిలోలు) లభ్యమయ్యాయి. పట్టుబడిన బెల్లం పట్టిక ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ ఉప్పునుంతల మండలం సీబీ తండా గ్రామానికి చెందిన సభవత్ సురేందర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి ఎస్ఐ రాజు తెలిపారు. అక్రమ సారా తయారీ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


