తేదీ : 12/06/2026. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, జనార్ధన వరం గ్రామంలో సిసి రోడ్లకు నూజివీడు నియోజకవర్గం, ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి, శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఏరువాక సాగారో రైతన్నలు నాగలి దున్ని పంట పండిస్తే ఆ పంట నష్టపోకుండా రైతులకు లాభాలు చేకూరాలని మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్రం మరియు , జిల్లా, నియోజకవర్గం, మండలం గ్రామ లో రైతులందరూ పంటలు బాగా పండించి పందిన ధాన్యాన్ని అమ్మితే అధిక లాభాలు చేకూరాలని ఏ ఒక్కరైతు నష్టపోకుండా ఉండాలని, భూమిని నాగలతో దున్ని రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.
అక్కడికి వచ్చినటువంటి ప్రజలు వాళ్లకున్న సమస్యలను ఆర్జీ పత్రాలపై రాసి మంత్రికి ఇవ్వగా తక్షణమే సంబంధిత అధికారులు పిలిచి పరిష్కారం చేసే విధంగా ముందుండాలని సూచించారు. ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. రైతులు మరియు ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు, నియోజకవర్గం, మండలం, గ్రామ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


