కొట్లాది రూపాయలు కన్స్ట్రక్షన్ లో కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం. -అపార్ట్మెంట్ పై నుండి కింద పడి మృతి చెందిన తాపీ మేస్త్రి.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,జూన్,12: కాకినాడ విద్యుత్ నగర్ భాష్యం స్కూల్ వెనుక లో సుమన శ్రేణి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో గురువారం ఉదయం తాపీ మేస్త్రి పేరా బత్తుల శ్రీనివాస్ అపార్ట్మెంట్ నుండి పనిచేస్తుండగా పరంజి కర్ర విరిగి ప్రమాదవశాత్తు కింద పడిపోవడం జరిగింది. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ట్రస్ట్ హాస్పిటల్ కి తరలించారు. శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. తోటి కార్మికులు యూనియన్ కి సమాచారం తెలియజేయగా వెంటనే ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్,ఏఐటీయూసీ అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అపార్ట్మెంట్ వద్ద కు వెళ్లి జరిగిన ప్రమాదాన్నిస్థలాన్ని సందర్శించి, ట్రస్ట్ హాస్పిటల్ వద్ద ఉన్న శ్రీనివాస్ కుటుంబీకులను పరామర్శించారు.
అనంతరం నాగరాజు కన్స్ట్రక్షన్ అధినేత అపార్ట్మెంట్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించి పేరాబత్తుల శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబానికి చెల్లించాలని, లేదంటే శ్రీనివాస్ మృతదేహాన్ని అపార్ట్మెంట్ వద్ద తీసుకొచ్చి ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. కోట్ల రూపాయల సంపాదనలు మీకు ప్రాణ నష్టాలు భవన నిర్మాణ కార్మికులు కా అని, కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్లో చేపడుతున్న ఇంజనీర్స్, బిల్డర్స్ భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కన్స్ట్రక్షన్ రంగంలో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రమాణికాలు పాటించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రమాదాలు మరలా జరక్కుండా సేఫ్టీ మౌలిక సదుపాయాల పాటించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మ ఘోష ఈ ప్రభుత్వానికి కనబడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, శ్రీనివాస్, నూకరాజు, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, సురేష్, శివ, శేఖర్, బద్రి రావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


