Fire Accident : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవిం చింది. ద్వారకా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌ లోని ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతు న్నాయి.

సంఘటన స్థలానికి 8 అగ్గిమాపక యంత్రాలు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తు న్నాయి.ఈ మంటలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నట్టు సమాచారం

అగ్నిప్రమాదంతో భయాం దోళనకు గురైన అపార్ట్‌మెం ట్‌ వాసులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరు గులు తీశారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు భవనం పై నుంచి కిందపడిపోయి నట్లు తెలిసింది.

వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు.

భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయ త్నిస్తున్నారు. అగ్నిప్రమాదా నికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Major fire in Delhi?

You cannot copy content of this page

Scroll to Top