MLA Vegulla : రైతులకు పవర్ టిల్లర్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరం. వ్యవసాయ యాంత్రీకరణ పధకంలో భాగంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న పవర్ టిల్లర్లు ను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సోమవారం కపిలేశ్వరపురం మండల రైతులకు పంపిణీ చేశారు. కపిలేశ్వరపురం ఎంపిడిఒ కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమం నకు ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొని కపిలేశ్వరపురం మండలం నకు సంబంధించి రెండవ విడత గా మంజూరు అయిన 17 పవర్ టిల్లర్లు ను రైతులకు పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ యూనిట్ విలువ రూ.39.00 లక్షలకు గాను ప్రభుత్వం రూ.17.00 లక్షలు సబ్సిడి అందిస్తుందన్నారు. రైతులు శ్రమను తగ్గించుకుని దిగుబడులు పెంచుకొనుటకు ఈ యంత్ర పరికరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యవసాయంలో ఉపయోగించే యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పుత్సల శ్రీను, కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు బలవరెడ్డి సత్తిబాబు, కూళ్ళ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు మేకా శివ ప్రసాద్, కాలేరు సర్పంచ్ శ్రీమతి దాయం కావేరి, కపిలేశ్వరపురం సర్పంచ్ సాక శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla distributes power

You cannot copy content of this page

Scroll to Top