జూన్ 7 2025 (త్రినేత్రం న్యూస్) ధర్మసాగర్: MRPS మరియు అనుబంధ నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని.కందుకూరి సోమన్న మాదిగ.హనుమకొండ జిల్లా ఇన్చార్జి పిలుపునిచ్చారు. MRPS, MSP అనుబంధ సంఘాల హన్మకొండ మండల ముఖ్య నాయకుల సమావేశం MRPS ధర్మసాగర్ మండల ఇంచార్జి గంగారపు శ్రీనివాస్ మాదిగఅధ్యక్షతన జరిగింది.
ఈ కారక్రమానికి ముఖ్య అతిథిలుగా హన్మకొండ జిల్లా ఇంచార్జీ MSP సీనియర్ నాయకులు కందుకూరి సోమన్న మాదిగ, కో –ఇంచార్జీ MSFజాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జులై 7న MRPS 31వ వార్షికోత్సవాన్ని గ్రామ గ్రామన ఘనంగానిర్వహించాలనిపిలుపునిస్తూ ఈ నెల రోజుల పాటు MRPS సంస్థ గత నిర్మాణం పూర్తిచేయాలని, హనుమకొండ జిల్లాలోని అన్ని మండల మరియు ప్రతి గ్రామంలో నూతన MRPS మరియు అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు జరగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని MRPS ముఖ్య నాయకులను 14మండలాలకు ఇంచార్జీ, కో- ఇన్చార్జీలుగా నియమించారు. వీరి నేతృత్వంలో గ్రామాలలో మాదిగల సమావేశాలను నిర్వహించికమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రతి గ్రామ గ్రామానికి మేము వస్తామని అన్నారు.
నూతన కమిటీల ఏర్పాటుతో ఒక సైన్యంలా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ ,MRPS జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ, MRPS జిల్లా నాయకులు పుట్ట ప్రశాంత్ మాదిగ,MRPS మండల ప్రధాన కార్యదర్శి చిలుక రాజు మాదిగ,VHPS మండల అధ్యక్షులు మాచర్ల బాబు మాదిగ, MRPS మండల నాయకులు బొడ్డు ప్రణయ్ మాదిగMSF నాయకులు పుట్ట సిధార్థ,కొట్టె సంజీవ్ ద్రావిడ్, కొట్టెఅబిలాష్,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


