త్రినేత్రం న్యూస్ పెనుమూరు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ పురం రామ్మూర్తిని చిత్తూరు పార్లమెంట్ టిడిపి ఈడిగ బీసీకి సాధికార సమితి అధ్యక్షులు బుస్సా నాగరాజు గౌడ్, చిత్తూరు జిల్లా గౌడ్ సంఘం ఉపాధ్యక్షులు యలపల్లి దీన దయల్, చిత్తూరు జిల్లా గౌడ సంఘం యువసేన ప్రధాన కార్యదర్శి వేపాకుల మురళి గౌడ్, పూతలపట్టు గౌడ సంఘం నాయకులు తుమ్మల నాగరాజు గౌడ్, శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుస నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఒక బీసీ వ్యక్తి మా శ్రేయోభిలాషులు పురం రామ్మూర్తికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రాజ్యాంగ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డికి, మా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మా శ్రేయోభిలాషులు పురం రామ్మూర్తి మరింత ఉన్నత పదవులు అలంకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


