దేవరకొండ జూన్ 07 త్రినేత్రం న్యూస్. ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని అన్నారు. శనివారం దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబావి గ్రామంలో ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవం,బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టివిఎన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య, శ్రీపతి రుక్మ రెడ్డి, వేముల రాజు,తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


