డిప్యూటీ సీఎం, సంక్షేమ పథకాలు అమలు పై స్పందించండి.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సామర్లకోట,జూన్,02: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇళ్ల స్థలాలు మంజూరు కే రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ సామర్లకోటలో సోమవారం ఉదయం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నా కు ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. కామిరెడ్డి బోడకొండ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైన సందర్భంగా పార్టీపరంగా ఉత్సవాలు జరుపుకున్న ప్రజల్లో అసంతృప్తిని కలిగించే విధంగా పాలన ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల మేని ఫెస్టివల్ ప్రకారం అర్హులైన పేద ప్రజలందరికీ గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు భూమిని, అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు భూమి మంజూరు చేసి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు లోన్లు మంజూరు చేయాలని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తి అయిన ఒక్క సంక్షేమ పథకం కూడా ఇప్పటివరకు పేద ప్రజలకు అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్యాలు, డెలివరీలు ఆపరేషన్లు చేయించుకుని మంచానికే పరిమిత అయిన వారికి ఆసరా ద్వారా వచ్చే ఆర్థిక సహాయం అందడం లేదని, కుటుంబంలో యజమాని చనిపోతే ప్రభుత్వం తరఫున వచ్చే ఆర్థిక సహాయం కరువైందని, వివాహ కానుక ఇలాంటి క్లెయిమ్స్ ఎన్నెన్నో పెండింగ్లో ఉన్నాయని పెండింగ్ ఉన్న క్లెయిమ్స్ తక్షణమే పరిష్కరించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలుపై వాగ్దానం ఇచ్చి సంవత్సరకాలం పూర్తి అయిన కార్మికుల సమస్యల పట్టవా, వారి ప్రమాదాలు కనబడడం లేదా, సంబరాలు కన్నా సంక్షేమ పథకాలు అమలుపై స్పందించండి అని ఆయన అన్నారు. ఈ నిరసన ధర్నా అనంతరం ఎమ్మార్వో కి ఇళ్ల స్థలాల అప్లికేషన్లు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎమ్మార్వో, సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల స్థలాల వెబ్సైట్ ఓపెన్ అయిందని అర్హులైన పేద ప్రజలందరూ ఆన్లైన్లో అప్లికేషన్ నమోదు చేసుకోవాలని ఆయన బదులిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది రెడ్ల అర్జున్ రావు, మడగల రమణ, నమ్మి సత్యనారాయణ, బర్లంకి లక్ష్మీనారాయణ, దేవి అమ్మ, జ్యోతి, వెంకటలక్ష్మి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


