అల్లూరిజిల్లా(అరకులోయ) (త్రినేత్రం న్యూస్): జూన్ 3: అరకువేలి మండలానికి చెందిన చోంపి పంచాయతీ పరిధిలోని చోంపి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభమైంది. గ్రామ విఆర్వో అచ్చమ్మ, డిపో డీలర్ సరోజ సమక్షంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విఆర్వో అచ్చమ్మ మాట్లాడుతూ, “ప్రతి నెలా 1వ తేది నుండి 15వ తేది వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, అలాగే సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు పంపిణీ జరుగుతుంది” అని వివరించారు.
వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటికే సరుకుల పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఆదివారాలు కూడా రేషన్ షాపులు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


