MLA Vegulla : ప్రజా సమస్యలు తీర్చడానికే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ప్రజా సమస్యలు తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా మండపేట పట్టణంలో గొల్లపుంత కాలనీలో ఉన్న టిడ్కో గృహలకు విద్యుత్ సరిగ్గా రావడంలేదని మహిళలు వచ్చి ఫిర్యాదు చేయగా విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే వేగుళ్ళ ఆదేశించారు. అంగర ముస్లిం సంఘమునకు స్మశాన వాటికలో విశ్రాంతి భవనం నిర్మాణమునకు అర్జీ రావడం జరిగిందన్నారు. అలాగే వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"Public Issues Resolution Forum"

You cannot copy content of this page

Scroll to Top