నా అక్కా చెల్లెమ్మలతో పండుగ మరువలేనిది

TRINETHRAM NEWS

Trinethram News : సంక్రాంతి పండుగల సందర్భంగా వైసీపీ మహిళలకు కానుకగా చీరలు ప్రదానం చేసిన ఎంపీ భరత్

రాజమండ్రి, జనవరి 16: పండుగ అంటే సంతోషమని..ప్రతీ ఒక్కరి ముఖంలో ఆనందం, సంతోషం చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు, కార్యకర్తలకు చీరలను సంక్రాంతి కానుకగా ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాకు కుటుంబంతో సమానమని, పార్టీకి చెందిన వారందరూ నా తోబుట్టువులే అన్నారు. సంక్రాంతి పండుగలు సందర్భంగా వైఎస్సార్ సీపీలో మహిళలు నా అక్కలు, చెల్లెళ్ళకు ఒక సోదరుడిగా ఈ చిరు కానుకను అందజేసినట్టు తెలిపారు. చాలా సంతోషంగా ఉందని, మహిళామూర్తుల ఆశీస్సులు ఎంతో విలువైనవి, శక్తివంతమైనవని అన్నారు. మీకన్నీ శుభాలే అని నా అక్కలు, చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వేయి ఎనుగుల బలం వచ్చినట్టు అయిందని ఎంపీ భరత్ చెప్పారు.

You cannot copy content of this page

Scroll to Top