BCs Meeting : జూన్ 1న బీసీల రాష్ట్ర స్థాయి సమావేశం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు, దేశవ్యాప్తంగా సమగ్ర కులగనన, భవిష్యత్తు బిసి ఉద్యమ కార్యాచరణ పై చర్చించడానికి జూన్ 1వ తేదీన హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని* నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు
ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘాల బాధ్యులు, బీసీ సంఘాల,ప్రతినిధులు, నియోజకవర్గ నేతలు హాజరు కావాలని ఆయన కోరారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ అమలు, త్వరలో దేశవ్యాప్తంగా జరిగే జనగణలో సమగ్ర కులగనన అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షులు
బీసీ సంక్షేమ సంఘం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BCs state level meeting

You cannot copy content of this page

Scroll to Top