దేవరకొండ మే 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకొండ అభివృద్ధి ప్రదాత శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి మరియు గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఇప్పటికే మీకు హామీ ఇచ్చిన కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది అలాగే ఇంకా మిగిలి ఉన్న మీ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కూడా నా దృష్టికి తీసుకురావాలని, ఆ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది..
“తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత మీది – అర్హులైన కార్యకర్తలని ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదని అన్నారు.”
అలాగే దేవరకొండ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా పని చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రతి కార్యకర్తకు, ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు..
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణ్, తాజా, మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


