Press Club : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలము, భవన నిర్మాణం కొరకు వినతి పత్రం

TRINETHRAM NEWS

జనసేన పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుకి కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మర్యాదపూర్వకంగా కలిసి అందజేత.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలము భవన నిర్మాణం కొరకు జనసేన పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ స్థలము, భవనం లేక ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులు ప్రెస్ మీట్లు,యూనియన్ మీటింగులు,సమస్యల గురించి చర్చించుకుందామంటే సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.

ఇక్కడ విలేకరుల ఐక్యతా లోపమో మరి ఇంకేదైన కారణమో ఇప్పటి వరకు ఏ విలేకరి ప్రెస్ క్లబ్ కొరకు ఆలోచన చేయలేదు.అలాగే విలేకరులను సంఘటితం చేయలేక పోయారని ఆయన వివరించారు.ఈ నేపథ్యంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,వి.సుజాత, మీడియా కన్వీనర్ దుర్గాప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.లక్ష్మి,ఈసీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి,కర్ణ కుమార్, అనిల్ కిషోర్, బాబీ కాంత్, వినీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kukatpally Press Club site

You cannot copy content of this page

Scroll to Top