మంథని, మే -26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సజావుగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు సోమవారం మంథని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగులకు సజావుగా వైద్య సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు సుమారు 250 మంది ఔట్ పేషంట్ సేవలు అందుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్ ఓపి సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని వైద్య అధికారులకు సూచించారు
ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను రాయాలని , అవసరమైన మందుల స్టాక్ ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఆటంకం లేకుండా మంచి వైద్య సేవలను అందించాలని అన్నారు
ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


