అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్‌ అధికారి కుమార్తె మేఘన

TRINETHRAM NEWS

రామగుండం మే-26:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, మర్యాద పూర్వకంగా కలవగా సీపీ ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే టిజిపిఎ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ సారంగపాణి కుమార్తె గత కొన్ని సంవత్సరాలుగా పిస్టల్ షూటింగ్‌లో ఇస్సప్ జూనియర్ ప్రపంచ కప్ 2023, జర్మనీ, జట్టు బంగారు పతకం, ఆసియా ఛాంపియన్‌షిప్ 2023, దక్షిణ కొరియా, జట్టు వెండి పతకం, ఇస్సప్ ప్రపంచ ఛాంపియన్‌షిప్, దక్షిణ కొరియా 2023లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 3 జాతీయ ఛాంపియన్‌షిప్ పతకాలు మరియు బహుళ తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌షిప్ పతకాలు జూనియర్ వ్యక్తిగత కాంస్య, జూనియర్ సివిలియన్ కాంస్య, సీనియర్ జట్టు వెండి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంస్య పతకం సాధించడం జరిగింది.

విలువిద్యలో జాతీయ స్థాయి పోటీల్లో తన సత్తా చాట్టడం జరిగింది ఈ సందర్బంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ తన కార్యాలయములో సాదుల మేఘన ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ తమ పిల్లలను క్రీడల్లో వున్న ఆసక్తి గమనించి వారిని ప్రోత్సహించాలని, ముఖ్యంగా నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు సైతం తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిమచడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందించడం సంతోషదాయకమని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Meghana, the daughter of

You cannot copy content of this page

Scroll to Top