జూన్ 27, 2026
TRINETHRAM NEWS

ఉపాధ్యాయ రంగం వృత్తికాదు,బాధ్యత. ఉపాధ్యాయ రంగం వృత్తిగా భావించకుండా సామాజిక బాధ్యతగా పనిచేయాలి. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ మే23 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐదు రోజుల ఐక్య ఉపాద్యాయుల వృత్యాంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు దేవరకొండ నియోజక వర్గంలోని దేవరకొండ,చందంపేట,కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము మండలాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ప్రైవేటు సంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అన్నారు. విద్యార్దులకు అక్షర జ్ఞానం అందించడంతో పాటు వారిని సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే గురుతరమైన భాధ్యత ఉపాధ్యాయులపై వుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పాఠశాల ప్రారంభం తరవాత ప్రతి స్కూల్ కి విజిట్ చేస్తా. విద్యార్థుల నైపుణ్యాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచాలి. ప్రతి 3నెలకు ఒక్కసారి విద్యార్థుల తల్లిదండ్రులతో విద్య కమిటీని ఏర్పాటు చేసి, ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అన్నారు. మంచి విజ్జానం అందించే భోధనతో పాటు విద్యార్ధులను సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ధాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు సమాజ అభివృద్ధిలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులే ప్రథమ గురువని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రేపటి సమాజం మార్పులకోసం ఉపాధ్యాయులు విద్యార్ధులకు భోధించే విధ్యాబోధనలో, క్రమ శిక్షణలోను గురువులు బాధ్యత తీసుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో MEO లు,పాఠశాల ఉపాధ్యాయుల బృందం,ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nalgonda district should stand

You cannot copy content of this page