Velpula Kumaraswamy : 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలి, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

TRINETHRAM NEWS

వేల్పుల కుమారస్వామి,జిల్లా అధ్యక్షులు

గోదావరిఖని మే-20//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సీఐటీయూ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పలు సెక్షన్లపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా గోదావరిఖని ఆర్జీ 1 ఏరియాలో ఉన్న వివిధ కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద కార్మికులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డ్స్ తో నిరసనలు తెలిపి విధులకు హాజరైనారు. ఈసందర్భంగా వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె కు పిలుపివ్వదం జరిగింది. కానీ దేశంలో నెలకొన్న యుద్ద వాతావరణం దృష్టిలో పెట్టుకొని సమ్మెను జూలై 9 కి వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో పాల్గొన్న కార్మికులకు సీఐటీయూ తరుపున విప్లవ అభినందనలు తెలిపారు.
దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చి పెట్టుబడి దారులకు అనుకూలంగా చేశారని అన్నారు. ఇవి అమలు అయితే కార్మికులు యజమానులకు బానిసలుగా మారే అవకాశం ఉందని అన్నారు. వీటిని అడ్డుకోవడానికే
ఈ నిరసనలు అని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చడానికి మోడీ ఎవరు అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం కనీస వేతనం 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చట్టం చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. కనీసం రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో ఎందుకు కొలిండియ వేతనాలు అమలు చేయించడం లేదని అన్నారు. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీఐటీయూ పగోదావరిఖని ట్టణ కార్యదర్శి ఎం,సారయ్య, నాయకులు రాజు,మధు,రాజేందర్, రాజయ్య,అంజి,ఆనంద్,చారి,ఖాళీ,ఆదిలక్ష్మీ, ఇంద్ర, కోమలత,రోజా, కుమార్,మరియమ్మ, వసంత,శాంతి,కోమల, దీక్ష కుమారి,రాజేశ్వరి, కార్తిక్,పద్మ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

4 Labor codes should

You cannot copy content of this page

Scroll to Top