డిండి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు.: అబ్దుల్ ఖాదర్.
3లక్షల రూపాయలతో మండలకేంద్రంలో కొత్త పైప్ లైన్ తో నల్ల కలెక్షన్లు.
జంగాల కాలనీలో నివాసముంటున్న వారికి కొత్త ఇంటింటికీ నల్ల కలెక్షన్లు
డిండి (గుండ్ల పల్లి) మే త్రినేత్రం న్యూస్. దేవరకొండ శాసనసభ్యులు నేనవత్ బాలు నాయక్ ఆదేశానుసారం మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.డిండి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ చొరవతో వాటర్ పైప్ లైన్ మెటీరియల్ (సామాగ్రి )తో జంగాల కాలనీకి నేడు నూతన పైప్ లైన్ నల్ల కలెక్షన్లు ఇప్పించడం జరిగింది.
మంచినీటి సమస్యను తీర్చినందుకు శాసనసభ్యులు నేనా వద్ద బాలునాయక్ గారికి కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డిండి మండల కేంద్రంలో జంగాల కాలనీలో 36 కుటుంబాల ప్రజలకు నూతన నల్ల కలెక్షన్లు ఇప్పించడం జరిగింది. స్థానిక హై స్కూల్ మార్కొండయ్య దేవస్థానం ఆవరణలో మరియు రిక్రియేషన్ క్లబ్ నందుగల భగీరథ మంచినీటి ట్యాంకుల కు 140 డయా పైప్ లైన్ లను బిగించడం జరిగింది. నేటి నుండి డిండి స్థానిక పట్టణ కేంద్రంలో భగీరథ మంచినీటి సమస్య 90% తీర్చిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీవాసులు మాట్లాడుతూ మంచినీటి సమస్యను తీర్చి మాకు మంచి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చూపిన మరియు మా దాహార్తి తీర్చినందుకు ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇప్పించినందుకు శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు.. ఇంటింటికి నల్ల కలెక్షన్ మంచినీటిని అందించినందుకు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


