జిల్లాలొ బీసీలు మిన్న అధికారంలో సున్నా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లాలో బీసీలు ఇప్పటికైనా సోయిలోకి రండి లేకపోతే భవిష్యత్ తరాలు అంతరించి పోవడమే మాటల్లోనే జై భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం అంటున్న రాజకీయ పార్టీలు చేతల్లో చూపకపోవడం బాధాకరం జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్న భారత రాజ్యాంగ మూల సత్యాన్ని మరిచిన రాజకీయ పార్టీలు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలలో కనిపించని బీసీ నాయకత్వం అన్ని పార్టీలలో పెట్టుబడిదారీ కులాల బానిసత్వంలో బీసీ నాయకత్వం
గెలిచినా ఓడిన పార్టీలు మారి పదవులలో ఉంటూ అధికారాన్ని కాపాడుకుంటున్న పెట్టుబడిదారీ సామాజిక వర్గం నేతలు పార్టీలు మారినా, పార్టీ జెండాలే మోస్తూ, గుండుగుత్తగా ఓట్లు వేయిస్తూ అధికారాన్ని పెట్టుబడిదారులకు అప్పగిస్తూ బీసీలను బానిసత్వంలోకి నెట్టేస్తున్న బానిస బీసీ రాజకీయ బానిస నేతలు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రిజర్వుడ్ స్థానంలో గెలిచిన సభ్యులు తప్ప మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ ఒకే ఒక సామాజిక వర్గంఅభ్యర్థులే.వికారాబాద్ జిల్లాలో తమ ఓట్లు తాము వేసుకుంటే వార్డు మెంబెర్ నుండి ఎంపీ వరకు అన్ని జనరల్ స్థానాలు గెలిచే సత్తా ఉన్న 60 శాతం జనాభా ఉన్న బీసీలకు అన్ని పార్టీలలో జిల్లాలో కనీసం దక్కని రాజకీయ ప్రాతినిధ్యం.
జిల్లాలో వలస వచ్చిన నేతలకే పార్టీలలో అధిక ప్రాధాన్యం పార్టీ పదవులు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు కట్టబెడుతూ స్థానిక నాయకత్వాన్ని కనీసం పట్టించుకోని ప్రధాన రాజకీయ పార్టీలు.ముకుంద నాగేశ్వర్, టిజేఏసీ-చైర్మన్, తెలిపారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BCs in the districts

You cannot copy content of this page

Scroll to Top