ఇప్పుడు జివో నెం 3 వల్ల గిరిజనులకు ప్రయోజనం శూన్యం
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) ఎన్నో ఉద్యమాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు జీవో నెం.3ని పునరుద్ధరిస్తామని,వందకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు అందిస్తామని, ప్రకటించడం గిరిజన సమాజంలో సంతోషాన్ని కలిగించిన విషయమని, కొయ్యూరు వైసీపీ మండల అధ్యక్షులు బిడిజాన అప్పారావు అన్నారు.అయితే గిరిజన నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న డీఎస్సీ గిరిజనులకు న్యాయం జరిగేలా లేదని, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టుల కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని ఆయన సూచించారు.
మెగా డీఎస్సీ-2025 నోటిఫికెషన్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు జిల్లా స్థాయిలో భర్తీ చేయబడతాయి.అయితే ఈ డీఎస్సీ దరఖాస్తు గడువు మే 15, 2025తో ముగిసినందున,జీవో నెం.3 పునరుద్ధరణ ఈ డీఎస్సీకి ముందు అమలులోకి రాకపోవడం వల్ల గిరిజన యువతకు న్యాయం జరగలేదని, ప్రస్తుత డీఎస్సీని రద్దు చేసి గాని లేదా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న 881 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తే బాగుండేదని,లేని పక్షంలో మీరు ప్రత్యమ్నాయం తెచ్చి,డీఎస్సీని తీస్తే గిరిజనుల బ్రతుకుల్లో దీపం వెలిగించిన వారవుతారని అప్పారావు అన్నారు.
ఈ డీఎస్సీలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులు జీవో నెం. 3 అమలు కాకపోవడం వల్ల సాధారణ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం (షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు 6 శాతం) భర్తీ చేయబడతాయి. ఒకవేళ జీవో నెం. 3 అమలులో ఉంటే, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఈ పోస్టులు 100 శాతం స్థానిక గిరిజనులకు దక్కేవి. ఈ అవకాశం కోల్పోవడంతో గిరిజన యువతలో నిరాశ నెలకొంది.
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ నుండి మినహాయించి, వాటి కోసం ప్రత్యేకంగా స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని బిడిజాన అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ స్పెషల్ డీఎస్సీలో జీవో నెం. 3 నిబంధనల ప్రకారం, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని 881 పోస్టులను స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వ్ చేయాలని ఆయన సూచించారు. ఈ చర్య గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా, గిరిజన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని బిడిజాన అప్పారావు మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


