Boddupalli Chandrasekhar : జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన బొడ్డుపల్లి చంద్రశేఖర్

TRINETHRAM NEWS

తేదీ: 14-05-2025
నల్గొండ

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల బదిలీకి సంబంధించి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన బొడ్డుపల్లి చంద్రశేఖర్

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడ్ మండలానికి చెందిన పిట్టలగూడ గ్రామంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల, నియోజకవర్గ అంచున ఉండటంతో విద్యార్థులకు రాకపోకలలో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పురాతన భవనం, తక్కువ మౌలిక వసతుల కారణంగా కళాశాలలో అడ్మిషన్లు పడిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ నిధుల వృథా జరుగుతున్నది.

ఈ సమస్యపై స్పందించిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల గౌరవనీయ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న , జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక లేఖను రాసిన విషయం విదితమే. ఆ లేఖకు అధికారులు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో, ఈ రోజు బీసీ సమాజ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ ని కలిసిన బృందం, ప్రత్యక్షంగా వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం బీసీ సమాజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది ప్రముఖ నాయకులు బుడిపాక సత్యనారాయణ, నిమ్మనగోటి సీనయ్య ఉన్నారు

వినతిలో ప్రముఖంగా వివరించిన అంశాలు:

పిట్టలగూడలోని కళాశాల భవనం చాలా పాతది, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంది

రాకపోకలు కష్టంగా ఉండటంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి

నాగార్జునసాగర్‌లో ఖాళీగా ఉన్న బీఈడీ కళాశాల భవనంలోకి ఈ మైనార్టీ గురుకుల కళాశాలను బదిలీ చేయాలని విజ్ఞప్తి

బదిలీ జరిగితే: విద్యార్థులకు సులభమైన రాకపోకలు.. నాణ్యమైన మౌలిక వసతులు.. అడ్మిషన్లు పెరిగే అవకాశం.. పేద మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడం.. ప్రభుత్వ వనరుల సమర్థవంతమైన వినియోగం..

ఈ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు, మరియు తగిన పరిశీలన చేసి మైనారిటీ గురుకుల HOD లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇది విద్యా సమానత్వం కోసం బీసీ సమాజ్ ప్రారంభించిన ఉద్యమానికి కీలక ఘట్టం.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన భవిష్యత్ ఇవ్వాలన్న ఆత్మసంకల్పంతో – బీసీ సమాజ్ ముందుంటుంది!

బొడ్డుపల్లి చంద్రశేఖర్
బీసీ సమాజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు & రాష్ట్ర కార్యదర్శి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Boddupalli Chandrasekhar submitted a

You cannot copy content of this page

Scroll to Top