త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అంకంపాలెం పాఠశాల ఎదురుగా ట్రాన్సఫార్మర్ కిందకి ఉండటం వల్ల అదే గ్రామానికి చెందిన రైతు కోర్స పుల్లయ్య ఎద్దు మేత మేసుకుంటూ వెళ్ళి కరెంట్ షాక్ కు గురై మరణించడం జరిగింది. రైతు పుల్లయ్య సంఘటన స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న ఎద్దుని చూసి ఆవేదన చెందుతూ, కన్నీటి పర్యంతమవడం గ్రామస్థులను కలచివేసింది.
విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, బాధిత రైతు ఎద్దుకు నష్ట పరిహారం వెంటనే చెల్లించి న్యాయం చేయాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేయడం జరిగింది. మరలా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు, రైతులు,బాధిత కుటుంబసభ్యులు కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


