Trinethram News : విశాఖపట్నం, త్రినేత్రం న్యూస్ మే 14: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజేఎఫ్) పూర్వ నాయకులు, సీనియర్ జర్నలిస్టు నూతపల్లి సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరవలోని ఆరాధన చిల్డ్రన్ హోమ్‌లో యూజేఎఫ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ అధ్యక్షులు డా. ఎం.ఆర్.ఎన్. వర్మ మాట్లాడుతూ, విలువలతో కూడిన జర్నలిజానికి సత్యనారాయణ ప్రతిరూపమని, వృత్తి పరంగా మాత్రమే కాకుండా సామాజిక సేవల పట్ల గాఢమైన ఆసక్తిని కలిగి ఉన్న మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనలో యూజేఎఫ్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలియజేశారు.
ఏపియూడబ్ల్యూజే విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కె. రాము మాట్లాడుతూ, సత్యనారాయణ జర్నలిస్టుగా ఉన్నత స్థాయిలో రాణించడంతో పాటు జర్నలిస్టు సంఘాల పట్ల విశేషంగా సేవలందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆరాధన చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు ప్రియ భాంధవి మాట్లాడుతూ, సత్యనారాయణ స్నేహానికి ప్రతీకగా నిలిచారని, స్నేహ బంధాలను ఎంతో విలువైనవిగా భావించి జీవించిన వ్యక్తి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, స్థానిక ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


