Chittam Murali : గిరిజన గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు

TRINETHRAM NEWS

జనసేన నాయకుడు చిట్టం మురళి పర్యటన

అల్లూరిజిల్లా(అనంతగిరి) మండలం , మే 9: అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ పరిధిలోని జాంగూడ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రజలు ఆధారపడే వర్షాధారిత వ్యవసాయానికి సహకారంగా ఈ ఏడాది పనులు ముందుగానే చేపట్టడం గమనార్హం.
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఉపాధి పనులు పూర్తవ్వడం వల్ల గిరిజనులు తాము అనుసరించే సాంప్రదాయ వ్యవసాయం దిగుబడులు మెరుగుపడతాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి జాంగూడ గ్రామంలో పర్యటించి, జరుగుతున్న ఉపాధి హామీ పనులను సమీక్షించారు. పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలు విన్నారు.
ఈ సందర్భంగా శ్రామికులు మాట్లాడుతూ, “డబ్బులు సకాలంలో అందుతున్నప్పటికీ, గతంలో లభించిన మెడికల్ కిట్లు, వేసవి కాలంలో ఏర్పాటు చేసే టెంట్లు ఇప్పుడు లేవు. వాటిని తిరిగి సమకూర్చేలా చూడాలి,” అని విన్నవించారు. స్పందించిన చిట్టం మురళి, “ఇవన్నీ సాధ్యాసాధ్యాల పరంగా పరిశీలించి సంబంధిత అధికారులకు, మండల ఉపాధి హామీ కార్యాలయానికి నివేదిస్తాను,” అని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో గ్రామ పీల్డ్ అసిస్టెంట్లు రాధమ్మ, నరసమ్మ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Employment Guarantee Scheme works

You cannot copy content of this page

Scroll to Top