Manyam Bandh : మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగింది

TRINETHRAM NEWS

గిరిజనుల ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అరకు ఎమ్మెల్యే డిమాండ్.

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 4 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ పిలుపుమేరకు శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతంగా కొనసాగింది. బంద్ కు స్థానిక ప్రజలు, గిరిజన సంఘాలు విశేషంగా మద్దతు తెలిపారు. బంద్ అనంతరం జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే మత్స్య లింగం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీకి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకురావాలి. గతంలో అమలులో ఉన్న జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలు 100% గిరిజనులకే ఇవ్వాలని, ఉపాధ్యాయ నియామకాలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి” అని డిమాండ్ చేశారు.
ఇక, ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 766 టీచర్ పోస్టుల్లో గిరిజనులకు కేవలం 42 పోస్టులు మాత్రమే వచ్చాయని, మిగతా 724 పోస్టులు గిరిజనేతరులకు వెళ్లిపోతున్నాయని వాపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో అరుకు సభలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, “జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేస్తామని, అవసరమైతే కోర్టులో పోరాటం చేస్తామని, లేదా ప్రత్యేక జీవో ద్వారా గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి” అని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల, యువజన సంఘాల, విద్యార్థి సంఘాల మద్దతుతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Manyam bandh continued peacefully

You cannot copy content of this page

Scroll to Top