Adi Shankaracharya Jayanti : ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి

TRINETHRAM NEWS

త్రినేత్ర న్యూస్, అనపర్తి : మే 2 : అద్వైత మత స్థాపన చార్యులు జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతిని ఘనంగా శుక్రవారం నిర్వహించారు. అనపర్తి గ్రామంలోని సనాతన ధర్మ పరిరక్షణ సమితి గా విరజిల్లుతున్న శ్రీ బాల రాజేశ్వరి పీఠం సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి సురేష్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆది శంకరుల చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ శర్మ మాట్లాడుతూ సనాతన ధర్మమునకు ముప్పు ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో వేద ప్రమాణికమైన సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించడానికి ఆది శంకరాచార్యులు జన్మించారని వారి బోధనలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించడం ప్రతి మనిషి యొక్క ధర్మమని మానవులు ధర్మాలను కర్తవ్యాలను విడనాడ రాదని ప్రబోధించిన వ్యక్తి ఆదిశంకరాచార్యులు అన్నారు. ప్రపంచ శాంతికి ఆదిశంకరాచార్యులు అద్వైత మత బోధనలే కారణమని సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన ధర్మ ప్రచారాన్ని చేపట్టిన మహా గురువు ఆదిశంకరాచార్యులు అన్నారు.ఈ కార్యక్రమంలో అతిధులుగా హైదరాబాద్ చెందిన బిహెచ్ఎల్ నారాయణరావు విజయలక్ష్మి దంపతులు రెడ్డి రామ మోహన రావు సర్వ లక్ష్మీ దంపతులు రెడ్డి సతీష్ నాగదేవర బాలాజీ శర్మ తదితరుపాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాద స్వీకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adi Shankaracharya Jayanti celebrated

You cannot copy content of this page

Scroll to Top