Janasena Leader : మే డే సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించిన జనసేన నాయకుడు : ప్రేమ కుమార్.

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బి కాలనీ 5వ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జిహెచ్ఎంసి కార్మికులను శాలువా వేసి సన్మానించి , బహుమతులు మరియు పండ్లు ఇచ్చారు అనంతరము అల్పాహారము అందించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజులకొద్దీ దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని.ఈ చాకిరి మేము చేయలేమని పనిముట్లు క్రింద పడేసి 8 గంటల పని దినం కోసం పోరాటాలు చేశారని, చివరకు ప్రాణాలు సైతం త్రుణప్రాయంగా త్యాజించడం కార్మిక వర్గ పోరాటానికి నిదర్శనమని,దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కార్మికులే ఈ దేశానికి పట్టుకొమ్ములని , తమ కష్టముతో సమాజ సంపదను పెంచేది కార్మికులేనని , శ్రామికులు తమ హక్కులను సాధించుకున్నారని అన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి కార్మికులకు నెల వేతనాలు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ మండలి దయాకర్ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, వేముల మహేష్ ,కలిగినీడి ప్రసాద్ , అడబాల షణ్ముఖ , పాదం సూర్య ,పసుపులేటి ప్రసాద్ , పులగం సుబ్బు , గుణశేఖర్ , నవీన్ , మారుతి, ఆత్మూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena leader Prema Kumar

You cannot copy content of this page

Scroll to Top