త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గoపెనుమూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జెండా ఆవిష్కరించి శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన పెనుమూరు మండలం మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు. తరువాత ఆయన మాట్లాడుతూ శ్రమజీవుల కష్టానికి గుర్తింపు చెమట చుక్క విలువకు చాటింపు కార్మిక పోరాటానికి మేలు మలుపు అని తెలిపారు. కార్మిక సోదరులకు ఆటో కార్మికులకు కర్షక సోదరులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఆటో డ్రైవర్ అసోసియేషన్ తరపున కృష్ణమూర్తి నాయుడు ను సంజీవి తదితరులు దుస్సాలువతో సత్కరించి కేక్ కట్ చేసి కార్మిక సోదరులందరికీ పంచి పెట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


