త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే దివ్యాంగురాలైన వనజకు ఈరోజు పెన్షన్ తో పాటు త్రిచక్ర వాహనం అందజేశారు. నిరుద్యోగ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ ప్రకటన వల్ల డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారందరికీ చాలా ఆనందంగా ఉందని అన్నారు.
నేను దివ్యంగురాలిని కనుక ఎక్కడ తిరగ దానికి వీలు లేక ఉన్నానని స్థానిక నాయకుల ద్వారా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు తెలుపగా నాకు త్రీ వీలర్ బైక్ ను అందజేశారు. నాకు బైకు సహాయం చేసిన చంద్రబాబు నాయుడు కు, మంత్రి నారా లోకేష్ కు, స్థానిక ఎమ్మెల్యే థామస్ కు, అలాగే స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, సర్వేయర్ మధు స్థానిక పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


