తేదీ : 01/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యాలయాన్ని మేడే సందర్భముగా జెండా ఎగరవేసి, సంబంధిత నాయకులు మరియు, కార్మికుల చేత రిబ్బన్ కట్ చేయించి కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది.
ఈ విధంగా విస్సన్నపేట నుండి సత్తుపల్లి, ఏ కొండూరు, విజయవాడ వెళ్లే రోడ్డు మార్గంలో బస్టాండ్ దగ్గరలో ఉన్న గుడి పక్కన కూడా జెండా ఎగరవేయడం జరిగింది. నూతన కార్యాలయం నుండి సెంటర్ వరకు కార్మికులు, కర్షకులు, శ్రామికులు, ఏయన్ యం లు , ఆశ వర్కర్లు నాయకులు అందరూ కూడా ర్యాలీ నిర్వహించి ప్రపంచ కార్మికులారా వేకం కాండీ మన హక్కులను మనం సాధించుకుందాం అని పిలుపునిచ్చారు.
జెండాను ఎగరవేసిన సందర్భంలో యూనియన్ లో ఉన్నటువంటి పెద్దలు వారి మాటల రూపంలో మే డే గురించి వివరించారు. తరువాత నూతన కార్యాలయంలో సంబంధిత యూనియన్ పెద్దలు , గ్రామ సర్పంచ్ , వైసిపి మండల అధ్యక్షులు ,మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా తాపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు, వారి మాటల్లో ప్రజల్లో స్పందన వచ్చేలా మాట్లాడడం జరిగింది.
మాట్లాడే ముందు వాళ్లందరికీ పూలమాలలు వేసి , పుష్పగుచ్చాలు ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. వచ్చినటువంటి వాళ్లకు ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, రాకుండా యూనియన్ నాయకులు, సభ్యులు చూసుకున్నారు. మజ్జిగ , మరియు భోజనాలు ఏర్పాటు చేశారు. మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విస్సన్నపేట తాపీ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు, సహాయక కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. యం. అప్పారావు, పి. శ్రీనివాస్, ఎ. శోభన్ బాబు, యం. సత్యనారాయణ , సుబ్బారావు , తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


