తేదీ : 01/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ యార్లగడ్డ .వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత రాజకీయాలకతీతంగా సామాజిక పింఛన్లు అందిస్తామని అనడం జరిగింది. ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని , అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల సొమ్మును పెంచిన సంగతి గుర్తు చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ప్రజలందరూ ఆయనకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కె. ఆనంద్, గ్రామ సర్పంచ్ వి. శ్రీదేవి, యన్. కొండ, సాంబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


