Collector P Prashanthi : 91.43 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

TRINETHRAM NEWS

కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో 2,34,576 మంది పెన్షన్ లబ్ధిదారులలో మధ్యాహ్నం వరకు 2,14,463 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.

గురువారం స్థానిక హుకుంపేట గ్రామ పంచాయతీ కాపుల పేటలో ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ అధికారుల ద్వారా అత్యంత పకడ్బందీగా ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన విధంగా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2,34,576 మందికి రూ.102, 08 , 64, 500 లకి గాను మధ్యాహ్నం వరకు 2,14,463 మందికి 93, 12, 99 ,000 వేలు పంపిణి చెయ్యడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా హుకుంపేట కాపుల పేటకు చెందిన మంచనా పడ్డ (బెడ్ రీడెన్) తదితరులకు పెన్షన్ సొమ్ము అందచేశారు. కలెక్టర్ చేతుల మీదుగా చామకూరి నారాయణస్వామి – వృద్ధాప్య. పింఛను , బెజవాడ సత్యనారాయణ – దివ్యాంగ పింఛను , మానేపల్లి జయ – వితంతు పింఛను ను సొమ్ము అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపిడివో డి. శ్రీనివాస రావు, మండల ప్రత్యేక అధికారి/ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, పెన్షన్ చెల్లింపు అధికారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTR Bharosa Social Security

You cannot copy content of this page

Scroll to Top