జూన్ 27, 2026
TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(డుంబ్రిగూడ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ మే 1: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం, అడపవలస గ్రామం సమీపంలోని గిరిజనుల గ్రామదేవత మల్లమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించబడింది. ప్రతి ఏడాది చల్లని కొండల మధ్య భక్తుల మేళా జోరుగా సాగుతుంది. ఈ ఏడాది కూడా ఒడిశా రాష్ట్రం నుండి పాటు, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి తల్లిని దర్శించుకున్నారు.మల్లమ్మ తల్లిని ఆరాధించే భక్తుల విశ్వాసం అమోఘం. తమ కోరికలు తల్లికి మొక్కి, తీరిన వెంటనే మొక్కులు చెల్లించేందుకు ఈ పవిత్రమైన మల్లమ్మ తల్లి గృహాలకు భక్తులు అడవి మార్గాల్లోనూ ప్రయాణిస్తూ చేరుకుంటారు. తల్లి మహిమ అనుభవించిన వారు ఏడాది విడిచి ఏడాది తప్పకుండా ఈ జాతరకు హాజరవుతారు. భక్తుల ఈ విశ్వాసం క్షేత్ర ప్రాధాన్యతను మరింత పెంచుతోంది.
జాతర సందర్భంగా మల్లమ్మ తల్లి గృహాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు “మల్లమ్మ తల్లి జాతరకు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకంగా ఒడిశా నుండి వచ్చే భక్తుల తాకిడి గణనీయంగా ఉంది. తల్లి దయ వలన కోరికలు తీరినవారు మరల మరల వచ్చి తల్లికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు,” అని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
గ్రామీణ సాంస్కృతిక కమ్మొత్తాన్ని ప్రతిబింబించేలా స్థానిక కళారూపాలు, వేషధారణలు, డప్పు మేళాలు జాతరను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. గ్రామదేవత మల్లమ్మ తల్లికి జరిగిన ఈ మహోత్సవం భక్తుల మనసులను ప్రభావితం చేసి, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేకెత్తించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Mallamma Thalli Jatara

You cannot copy content of this page