పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి. నగేష్ కుమార్ నేతృత్వంలో పునాది
అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు నియోజకవర్గం: ఏప్రిల్ 30: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ కిట్ పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి. నగేష్ కుమార్ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకునేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ మంచితనం, గొప్పతనం మాటల్లో చెప్పలేనిది” అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే చరిత్రలోనే మొట్టమొదటి సారి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వ విధానాన్ని తీసుకురావడం పవన్ కళ్యాణ్ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
జనసైనికుల సంకల్పం, వీరమహిళల ధైర్యసాహసాలు, వారి కుటుంబాల అండలతో జనసేన పార్టీ బలోపేతం అవుతోందని ఆయన వెల్లడించారు. పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామనీ, నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి మరియు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.
ఇకపై కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని మజ్జి. నగేష్ కుమార్ స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


