జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3 వ ర్యాంక్ మరియు జిల్లాలో 1వ ర్యాంక్ సాధించిన సౌమ్య. ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన పెంబులా రాంబాబు – సమ్మక్క దంపతుల కుమార్తె సౌమ్య ఇటీవల విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1వ సాధించింది. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన సౌమ్య తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి కుటుంబానికి చెందిన సౌమ్య ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ సౌమ్యను సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు గుంపుల రవితేజ,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోడిమే వంశీ,యూత్ కాంగ్రెస్ నాయకులు చవ్వ ప్రశాంత్, జరుపుల బాలాజీ,గంటా రాము తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector, MLA Jare

You cannot copy content of this page